Posts

#తెలుగుప్రపంచభాషఎప్పుడవుతుంది?

Image
  #తెలుగుప్రపంచభాషఎప్పుడవుతుంది? రచన: వెల్చేరు నారాయణరావు గారు  తెలుగు చాలా అందమైన భాష. తెలుగు చాలా తియ్యని భాష. తెలుగు చాలా గొప్ప భాష. (అప్పుడే చప్పట్లు కొట్టకండి.) ఈమాటని ఎవ్వరూ కాదనరు. మా అమ్మాయి చాలా అందమైనది. చాలా తెలివైనది. నాతో ఆ విషయం మీద మీరు ఎప్పుడూ పోట్లాడరు. మీ అమ్మాయి అందమైనది కాదు అని నాతో వాదించరు. పోన్లే పాపం ఆ తండ్రికి కూతురంటే ప్రేమ అని వొదిలేస్తారు. తెలుగు విషయంలో కూడా అంతే. తెలుగువాళ్ళు కానివారి సభకి వెళ్ళి, అందరూ ఇంగ్లీషువాళ్ళో, అందరూ ఫ్రెంచివాళ్ళో, అందరూ జర్మన్లో ఉండగా, తెలుగు ప్రపంచంలోకల్లా అందమైన భాష, గొప్ప భాష అని మీరనండి, తెలుగువాళ్ళు అంతేలే, తెలుగువాళ్లకి వాళ్ళ భాష అంటే అభిమానమని కాసేపు ఊరుకుంటారు. వాళ్ళ సభ్యత అడ్డు వస్తుంది కాబట్టి అంతకన్నా ఇంకేమీ అనరు. మనకి తెలుగు అందమైన భాష కావడానికి కారణం మనకి తెలుగు ఒక్కటే రావడం. మనకి ఇంకొక భాష నిజంగా రాదు. ఉద్యోగరీత్యా వచ్చిన ఇంగ్లీషు భాష మనకి వొచ్చు. సాహిత్యరూపంలో వచ్చే ఇంగ్లీషు మనకి రాదు, కాకపోతే రాదని మనకి తెలియదు. తెలుగువాళ్ళు ప్రపంచంలోకి వచ్చారు. అమెరికా వచ్చారు, ఇంగ్లాండు వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. ద...

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈపద్యం గురించి తెలుసా!? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!! విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది.  ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది.  మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి.  ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు.  కొన్ని కొన్ని చేయకూడదు.  పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు.  అది మనవల్ల కాదు.  మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు.  అది కష్టం.  కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన  గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు. ’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.  అటువంటి దుర్గమ్మ మాయమ్...

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.

 1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. 2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది. 3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. 4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు. 5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి? 6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు. 7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. 8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు. 9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. 10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంద...

మహిమాన్విత దేవాలయాలు

 సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:  1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.  2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.  3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.  4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.  5. మొగిలీశ్వర్. 6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా. నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:  1. మహానంది 2. జంబుకేశ్వర్  3. బుగ్గరామలింగేశ్వర్ 4. కర్ణాటక కమండల గణపతి. 5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం. 6. బెంగళూర్ మల్లేశ్వర్  7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం 8. సిద్ధగంగా నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.  1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.  2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,   3. మంజునాథ్. శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్ సముద్రమే వెనక్కివెళ్లే  1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,  2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం. స్త్రీవలె నెలసరి అయ్యే  1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,   2. కేరళ దుర్గామాత. రంగులు మారే ఆలయం.  1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడ...

హిందూ ఋషులు జాబితా

Image
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు. బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు. మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు. రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి. అ అగ్ని మహర్షి అగస్త్య మహర్షి అంగీరస మహర్షి అంగిరో మహర్షి అత్రి మహర్షి అర్వరీవత మహర్షి అభినామన మహర్షి అగ్నివేశ మహర్షి అరుణి మహర్షి అష్టావక్ర మహర్షి అష్టిక మహర్షి అథర్వణ మహర్షి ఆత్రేయ మహర్షి అథర్వాకృతి‎ అమహీయుడు అజామిళ్హుడు‎ ఆప్నవ  అప్రతిరథుడు‎ అయాస్యుడు‎ అవస్యుడు అంబరీషుడు ఇ ఇరింబిఠి‎ ఉ ఉపమన్యు మహర్షి ఉత్తమ మహర్షి ఉన్మోచన ఉపరిబభ్రవుడు ఉద్దాలకుడు‎ ఉశనసుడు ఉత్కీలుడు ఊ ఊర్ఝ మహర్షి ఊర్ద్వబాహు మహర్షి ఋ ఋచీక మహర్షి ఋషభ మహర్షి ఋష్యశృంగ మహర్షి ఋషి ఔ ఔపమన్యవ మహర్షి ఔరవ మహర్షి క కపిల మహర్షి కశ్యప మహర్షి క్రతు మహర్షి కౌకుండి మహర్షి కురుండి మహర్...

మహాభారతం లోని ఒక చిన్నకథ

Image
నేటి కాలానికి సరిపోయేలా పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన ్ని చూసారు. అరెరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని ఎంత దరకైన కొనాలి ఆనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు. గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు. దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు. మెదటి ప్రశ్న: ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు. మరల గుర్రం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు. సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూ...

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

Image
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. 1. శ్రీమద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? =జాం...